ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవి విరమణ వయసును ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం 60 ఏళ్లకు ఉన్న 62 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టం 1982 సవరణ బిల్లును ప్రభుత్వం ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల చట్టం 1962 సవరణ బిల్లు ద్వారా, జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేలా కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. 2022 జనవరి 1 నుంచి 2022 నవంబర్ 29 మధ్య 60 సంవత్సరాలు నిండి, సర్వీసు నుంచి పదవి విరమణ చేసిన గ్రంథాలయ సంస్థల ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.