ఏపీ చేనేత కార్మికులకు హోం మంత్రి అనిత శుభవార్త చెప్పారు. చేనేత కార్మికులను కాపాడుకోవాలని…తమ ప్రభుత్వంలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విశాఖ….
ఆర్కే బీచ్ లో కలర్ ఫుల్ గా హ్యాండ్లుం శారీ వాక్ జరిగింది. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు మహిళలు.. ఇక శారీ వాక్ లో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత…అనంతరం మాట్లాడారు. చీరకట్టడం మన సాంప్రదాయమని… చీరలో అమ్మతనం, కమ్మతనం ఉంటుందన్నారు హోం మంత్రి అనిత.
చీర అనే సరికీ గుర్తుకు వచ్చేది అమ్మ అని… భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగీంచాలని పేర్కొన్నారు హోం మంత్రి అనిత. చీర నేచేటప్పుడు చేనేత కార్మికులకు కష్టం ఉంటందన్నారు. చేనేత కార్మికులు ఇప్పటికి చాలా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు హోం మంత్రి అనిత. చేనేత కార్మికులను కాపాడుకోవాలని అన్నారు. ఒక చీర నేయడానీకీ దాదాపుగా ఇరవై రోజులు పడుతుంది…. చిన్నపాటి వర్షాలు వచ్చినా చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు హోం మంత్రి అనిత.