ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ బస్సు పై… తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికల హామీలో భాగంగా… ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు కల్పిస్తామని చంద్రబాబు కూటమి గతంలో తెలిపింది. మేనిఫెస్టోలో కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీనిపై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ ఫ్రీ బస్సు అమలుపై… నివేదిక తయారు చేస్తోంది ఈ చంద్రబాబు ప్రభుత్వం.
ఉచిత బస్సు పెడితే ఎంత ఖర్చు అవుతుంది ? ఎంత నష్టం ఉంటుంది ? ఫ్రీ బస్సు కోసం ఖర్చు చేసే డబ్బులను ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేదానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీస్ లతోపాటు విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలలో సిటీ ఆర్డినరీ అలాగే మెట్రో సర్వీసులలో ఉచిత సదుపాయం కల్పించేలా… చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆగస్టు 15 తర్వాత… ఈ స్కీమ్ అమలు చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఏపీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.