వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. వైద్య శాఖ లో 2018కి ముందు నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% గ్రాస్ వేతనాన్ని (పే+HRA+DA) చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 3,914 మందికి లబ్ధి చేకూరుతుందని పారా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ వెల్లడించారు. కేడర్ను బట్టి రూ. 10,000 నుంచి రూ. 15000 వరకు జీతాలు పెరుగుతాయన్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో 100% గ్రాస్ వేతనం స్థానంలో ‘కన్సాలి డేట్ పే’ చెల్లించేవారు.
ఇది ఇలా ఉండగా, ఈనెల 18 నుంచి వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మండపాల అనుమతులకు పోలీస్ శాఖ సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టింది. మున్సిపల్, పంచాయతీ, ఫైర్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ కార్యాలయాల చుట్టూ నిర్వాహకులు తిరగకుండా సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసింది. విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం, ఎత్తు, బరువు వివరాలతో దరఖాస్తులు సమర్పిస్తే అన్ని శాఖల అధికారులు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు.