Good news for farmers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. వారం రోజుల్లో 680 కోట్లు రిలీజ్ చేస్తామని ప్రకటించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు. తాజాగా రైతులతో.. కలిసి వారి బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు అచ్చం నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు.
భారీ వర్షాలు అలాగే గోదారి వరదలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు అచ్చం నాయుడు. ధాన్యం కొనుగోలు బకాయిలు 680 కోట్లు వారం రోజులు రిలీజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఏపీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వము అస్సలు చేయదని… రైతుల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందకూడదని.. వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. అందరినీ ఆదుకోవడమే తమ లక్ష్యం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను రోడ్డుపాలు చేసిందని మండిపడ్డారు అచ్చం నాయుడు.