ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి వేతనాల పెంపునకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గంటలు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.10వేలు ఇవ్వాే నిబంధన ఉన్నది. ఇక దానిని గంటకు రూ.375, నెలకు రూ.27వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు 3,572 మంది ఒప్పంద అద్యాపకుల సర్వీస్ ను 2026 ఏప్రిల్ వరకు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో గెస్ట్ లెక్చరర్లు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వారికి నెలకు రూ.10వేలు ఇవ్వడంతో వారి కుటుంబాలు గడవడం ఇబ్బంది అవుతుందని గతంలో వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం వారి వేతనాలను పెంచేందుకు ఆమోదం తెలపడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచడం వల్ల వారి కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొనడం గమనార్హం.