హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

-

ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చేసింది. హైడ్రా కార్యాలయం బుద్దభవన్ పక్కనే హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. డిజాస్టర్, ఫైర్ విభాగాల మాదిరిగానే సొంతంగా పోలీస్ స్టేషన్ తోడు అవ్వడంతో హైడ్రా కార్యకలాపాలకు మరింత బలం సమకూరనుంది. ఈ పోలీస్ స్టేషన్ కి SHO గా ఏసీపీ పి.తిరుమల్ నియమితులయ్యారు. ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, 12 మంది SI లు, 30 మంది కానిస్టేబుల్స్ ప్రస్తుతానికి ఈ పోలీస్ స్టేషన్ లో 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసారు.

ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, పార్కులు, రహదారులు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్ క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతతుంది. ఈ పోలీస్ స్టేషషన్ కు సమకూరిన అధికారాల మేరకు కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ కూడా చేస్తుంది. అలాగే చెరువులు, నాలాలు ప్రభుత్వ స్థలాల్లో మట్టి పోసిన వారిపై కూడా కేసులు బుక్ చేస్తుది. మట్టిని తరలించే వాహనదారులపై కాకుండా.. మట్టిని తరలించేందుకు ఉద్దేశించిన కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వ్యక్తిో పాటు ఆ మట్టి ఏ నిర్మాణ సంస్థకు చెందినదో తెలుసుకొని వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్ కేసులు నమోదు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news