పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ముఖ్యంగా ఒక వైపు భారత్ మెరుపు దాడులు చేస్తున్న నేపథ్యంలో.. మరోవైపు బలూచిస్తాన్ లిపరేషన్ ఆర్మీ రెచ్చిపోయింది. పాకిస్తాన్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టాలని.. తాజాగా ఎటాక్ చేసింది. ఈ తరుణంలోో పాకిస్తాన్ దేశానికి చెందిన 14 మంది సైనికులను చంపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. తాజాగా పాక్ ఆర్మీ వాహనం పై రిమోట్ కంట్రోల్ తో IED బాంబును పేల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పెషల్ ప్రాాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్.

ఈ నేపథ్యంలో ఏకంగా 14 మంది పాకిస్తాన్ సైనికులు మంది మృతి చెందారు. ముచ్ కుంద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. బుధవారం అందరూ నిద్రిస్తున్న సమయంలో పాకిస్తాన్ లోని ఉగ్రమూకలు ఉన్న 9 స్థావరాల్లో భారత్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు దాదాపు 100 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రశిబిరాల పై భారత్ దాడి చేసింది. తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎటాక్ చేసింది.