రేషన్ కార్డు దారులకు అలర్ట్. ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పౌరసరాఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు.
రెండు నెలలుగా బియ్యం, కందిపప్పు ధరల్లో పెరుగుదల ఉందని… అందుకే పౌరసరాఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో…రాష్ట్రంలో టోకు వ్యాపారులు, వాణిజ్య మండలి ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా వ్యాపారులు, మిల్లర్లు కార్పొరేట్ తక్కువ రేట్లకు నిత్యవసరాలు విక్రయించేందుకు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే వారి నుంచి సానుకూల స్పందన లభించిందని అరుణ్ కుమార్ తెలిపారు.