శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మే నెల దర్శన టికెట్లు విడుదల

-

తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో కొన్ని సార్లు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ భక్తుల  రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మంగళవారమైన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఎప్పుడైనా మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంటుంది. కానీ నేడు స్థానికులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా వచ్చినందున భక్తుల రద్దీ పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్న ప్రసాదాలను, మజ్జిగలను క్యూ లైన్లలో పంపిణీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్లోలోని 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న 60,784 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని 25.521 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మే నెల కోటాకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఈనెల 20వ తేదీ 10 గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version