ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఈ విధానాన్ని సరళతరం చేస్తూ ఏపీ సర్కార్ కొత్తగా మార్గదర్శకాలను మరోసారి విడుదల చేసింది. ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా ఇసుక బుకింగ్ సర్వీసులు అందుబాటులో ఉండగా, ఈ ప్రాసెస్ మీద అవగాహన లేనివాళ్లు గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకోవచ్చని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. ఏ రీచ్, ఏ స్టాక్ నుంచి ఎప్పుడు ఇంటికి ఇసుక చేరుతుందో వివరిస్తూ స్లాట్ కేటాయిస్తారు.
వాగులు, వంకలు, నదుల నుంచి ప్రజలు ఎద్దుల బండ్లలో ఫ్రీగా ఇసుకను తీసుకెళ్లవచ్చని వెల్లడించింది. ఇది ఒక రకంగా నిరుపేదలకు శుభవార్తగానే చెప్పుకోవచ్చును. ఎందుకంటే చిన్న ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి ఉచితంగా ఇసుకను అందించడం ప్రభుత్వం చేస్తున్న సహసం అనే చెప్పాలి. దీంతో పేదలకు సొంతింటి కల సాకారం అయ్యే ఆస్కారం ఉంది. అయితే, ఎద్దుల బండిలో ఇసుక తీసుకెళ్లేవారిని థర్డ్ పార్టీ వ్యక్తులు ప్రభుత్వం తరఫున పరిశీలిస్తుంటారు. ఎందుకంటే ఇది సక్రమంగా వినియోగిస్తున్నారా? బయట ఎవరికైనా అమ్ముకుంటున్నారా? అనేది నిఘా ఉంటుంది.