BREAKING: విజయవాడ వరద బాధితులకు సింహాచలం పులిహోర అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ రోజు 20 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడకు పంపిస్తున్నారు దేవాలయ అధికారులు. ఇవాళ ఉదయం జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో 10 వేల ప్యాకెట్లు పంపారు అధికారులు.
మధ్యాహ్నం రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లో మరో 10వేలు రవాణాకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ కు 10 వేల పులిహోర ప్యాకెట్లు చేరుకున్నాయి. ఇది ఇలా ఉండగా, విజయవాడలోని సితార, రాజరాజేశ్వరి పేట, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ముంపు కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలకు పూర్తిగా ఇళ్లు మునగడం తో అపార్ట్మెంట్ల పైన, కొండలపైన తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు. వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఇళ్ల వద్దకు వచ్చి పరిస్థితి ఏరకంగా ఉందో చూసుకుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.