గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు వరాలు ప్రకటించారు సీఎం చంద్రబాబు. చైతన్యం-2.0 ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చైతన్యం కార్యక్రమం చేపట్టి గిరిజనుల సంక్షేమానికి.. అభివృద్ధికి కృషి చేశాం. ఇప్పుడు మళ్లీ చైతన్యం 2.0 ప్రారంభిస్తాం. విశాఖ, తిరుపతి, విజయవాడల్లో గిరిజనుల కోసం మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
ట్రైకార్ ద్వారా గిరిజనులకు రుణాలిస్తాం. గిరిజనుల స్వయం ఉపాధికి ఇన్నోవా కార్లు ఇస్తాం. గిరిజన గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ, మంచి నీటి సరఫరా అందేలా చూస్తాం. పాడేరు వైద్యకళాశాలను రూ. 500 కోట్లతో పూర్తి చేస్తాం. నాగవళీ నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. గిరిజన ప్రాంతాల్లో నెట్, ఫోన్ కనెక్టివిటీ పెంచేలా సెల్ టవర్లు ఏర్పాటు చేస్తాం. గిరిజనులే నేరుగా ఆన్ లైన్లో తమ ఉత్పత్తులు అమ్ముకునే వ్యవస్థను రూపొందిస్తాం. గిరిజనుల్లో మాతా, శిశు మరణాలు తగ్గించేలా చర్యలు చేపడతాం. AI గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో డోలీల మోతలు ఉండడం బాధాకరం. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్సులను అందుబాటులోకి తెస్తాం. ప్రతి గిరిజన ప్రాంతానికి విద్య, వైద్య సదుపాయం అందిస్తాం. గిరిజనుల పండించే ఆర్గానిక్ ఉత్పత్తులకు బ్రాండింగ్ వచ్చేలా చేస్తాం. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ రావడం సంతోషకరం అన్నారు సీఎం చంద్రబాబు. పారిస్ వంటి నగరాల్లో కూడా అరకు కాఫీ అమ్ముతున్నారని వెల్లడించారు.