ఏపీ సర్కార్ శుభవార్త.. రేపు వరద నష్ట బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది చంద్రబాబు సర్కార్.. సాంకేతిక కారణాలతో పరిహారం అందని వారికి డబ్బులు జమ చేయనుంది బాబు ప్రభుత్వం.. 98 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.18 కోట్లు జమ చేసిన ఏపీ ప్రభుత్వం…రేపు మిగిలిన వరద నష్ట బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది.
ఇది ఇలా ఉండగా… ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి, చంద్రబాబు. రేపు కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు ఉంకూడదనే టార్గెట్టుగా పని చేస్తోంది కేంద్రం. మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనుంది కేంద్రం.