శుభ‌వార్త : ఆంధ్రా రోడ్ల‌కు మ‌హ‌ర్ద‌శ ! ఇవిగో నిధులు లెట్స్ గో గో గో !

-

ఫ‌స్ట్ కాజ్ : 1250-కోట్ల రూపాయ‌ల‌తో చేప‌డుతున్న మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌తో ఐదు వేల కిలో మీట‌ర్ల‌కు పైగా ఆంధ్రాలో రోడ్ల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. ఈ విష‌యాన్ని నిన్న‌టి వేళ సంబంధిత అధికారులు ధ్రువీక‌రించారు. దీంతో కొద్దిపాటి గుంత‌లు ఉన్న రోడ్లు కూడా కాస్తో కూస్తో మ‌రమ్మ‌తుల‌కు నోచుకోవ‌డం ఖాయం. రోడ్ల ప‌నులు పూర్త‌య్యాక నాడు నేడు అంటూ అధికారులు ఫొటోలు తీసి, వాటిని ప‌బ్లిక్ డొమైన్లో ఉంచ‌నున్నారు.

డిస్క‌ష‌న్ – డిస్క్రిప్ష‌న్ :

ఆంధ్రాలో ర‌హ‌దారులు అస్త‌వ్య‌స్తంగా ఉన్న నేప‌థ్యంలో గ‌తం నుంచి ఇప్ప‌టిదాకా కొన్ని రోడ్ల ప‌నులు చేప‌ట్ట‌లేని దుః స్థితి నెల‌కొన‌డంతో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్పందించారు. సానుకూల ధోర‌ణితో ప్ర‌జ‌ల మొర వినాల‌ని ఆయ‌న చెబుతుంటారు త‌రుచూ ! మ‌నం అరిస్తే కోపం అయితే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు అన్నా ! మీరు ఆలోచించాలి అని త‌రుచూ అంటుంటారు ఆయ‌న. త‌న మాట‌ల‌కు అనుగుణంగా త‌న ఆచ‌ర‌ణ ఉంటేనే జ‌నం ఆద‌ర‌ణ త‌నకూ, త‌న ప్ర‌భుత్వానికీ ఉంటుంద‌ని బ‌లీయంగా న‌మ్ముతారు ఆయ‌న. ఇందుకు అనుగుణంగానే పాల‌న ఉండాల‌ని ప‌రిత‌పిస్తున్నారాయ‌న.

నాడు – నేడు – రోడ్డుకు సైతం

ఇప్ప‌టికే గ‌తంలో ఉన్న బ‌కాయిలు మూడు వేల కోట్ల రూపాయ‌లను ఆయ‌న తీర్చేశారు. అదేవిధంగా ఇప్ప‌టిదాకా కొంత మేర‌కు బిల్లులు కూడా కాంట్రాక్ట‌ర్ల‌కు చెల్లించార‌ని తెలుస్తోంది. అమ‌లాపురం – బొబ్బ‌ర్లంక రోడ్లు ప‌నులు పూర్త‌య్యాయి. దీంతో ఈ రోడ్డు స్వ‌రూప‌మే మారిపోయింది. మిగ‌తా ర‌హ‌దారుల ప‌నులు కూడా త్వ‌ర‌లోనే చేప‌ట్టేందుకు వస్తున్న రెండు నెల‌ల కాలాన్నీ వెచ్చించ‌నున్నామ‌ని, ఇందుకు సీఎం చొర‌వ, స‌హ‌కారం, నిధుల కేటాయింపు అన్న‌వి పుష్క‌లంగా ఉన్నాయ‌ని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version