ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవహారంలో టాలీవుడ్ నటి అనన్య నాగళ్లపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఆమె స్పందిస్తూ ఇన్ స్టా వేదికగా ఓ పోస్టు పెట్టింది. హైదరాబాద్ మెట్రో రైలుపై ఓ బెట్టింగ్ యాప్ ప్రమోషనల్ యాడ్ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా.. ప్రభుత్వ ఆస్తి అయిన మెట్రోపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు. సర్కారే దీన్ని ప్రమోట్ చేసిన తర్వాత ఇక అది ఇల్లీగల్ అని మాకెలా తెలుస్తుంది అంటూ ఆమె ప్రశ్నించారు.
అనన్య నాగళ్ల పెట్టిన లేటెస్ట్ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవువుతోంది. అదీ.. అలా అడగండి అంటూ కొందరు నెటిజన్లు అనన్యకు సపోర్టుగా నిలుస్తుంటే.. ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అమాయకులు ఇబ్బందుల్లో చిక్కుకునేలా చేయడం కరెక్టు కాదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే కేసులో ఇప్పటికే 11 మంది యూట్యూబర్లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక సినీ తారలు రానా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, లక్ష్మీ మంచులకు నోటీసులు జారీ చేశారు.