మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తో ఆరుగురినీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చేబ్రోల్ కిరణ్ ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనాన్ని అడ్డుపడ్డ కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను ముసుగేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. గోరంట్ల మాధవ్ ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. మాధవ్ ను తొలుత నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు జీజీహెచ్ కి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం మాధవ్ ను కోర్టుకు తీసుకొచ్చారు. అంతకు ముందు కోర్టుకు తీసుకెళ్తున్న గోరంట్ల మాధవ్ ను తిరిగి ఎస్ఫీ ఆఫీస్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం.
ఎక్కడకు తీసుకెళ్తున్నారంటూ మరోసారి పోలీసులపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసులు తిరిగి కోర్టుకు తీసుకెల్లారు. పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగారు. అనంతరం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. చేబ్రోలు కిరణ్ కొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసుల అధుపులో ఉన్న నిందితుడు కిరణ్ పై మాధవ్ దాడికి పాల్పడ్డారు. గోరంట్లతో పాటు మరో ఐదుగురు దాడిలో పాల్పడ్డారని తెలిపారు.