ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్..!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 21వ తేదీ ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభం అవుతోందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 21, 22వ తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ జరగనుంది. ప్రొటెం స్పీకర్ ఎన్నిక తర్వాత.. ఈ సెషన్లో ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

టీడీపీ కూటమికి సభలో ఫుల్ మెజార్టీ ఉండటంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా జరుగుతోన్న అసెంబ్లీ సెషన్ ఇదే కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హాజరు అవుతారా లేదా అని ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష నేతల మధ్య ఎలాంటి డైలాగ్ వార్ నడుస్తుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news