ఏపీకి కరెంట్ కష్టాలు తీరనున్నాయి. తాజాగా విదేశాల నుంచి 31 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరతను అధిగమించడానికి 31 లక్షల టన్నులనను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని.. విద్యుత్ సంస్థలు నిర్ణయించినట్లు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటన చేశారు. ఏపీపీడీసీఎల్ 13 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు టెండర్లను పిలిచినట్లు ఆయన వెల్లడించారు.
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొత్తు లేకుండా ఎన్నికలు వెళ్లిన దాఖలాలే లేవని ఎద్దేవా చేశారు పెద్ది రెడ్డి. గతంలో తెలంగాణలో కేసీఆర్తో కూడా పొత్తు పెట్టుకున్నారని, కేవలం 2019 ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబు ఒంటరిగా ఎన్నిక లకు వెళ్లి ఘోర పరాజయం పాలయ్యారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. అవన్నీ గమనించి పొత్తు లేకుంటే డిపాజిట్లు దక్కవని చంద్రబాబు ఆలోచనలో పడ్డారన్న పెద్దిరెడ్డి.. అందుకే ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారన్నారు పెద్ది రెడ్డి..