పెందుర్తి శిరోముండనం బాధితుడు శ్రీకాంత్ ను ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ లు పరామర్శించారు. బాధితుడికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న అవంతి ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఆర్థిక సహాయం, అదేవిధంగా అవుట్సోర్సింగ్ లో ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. ఇక తన వ్యక్తిగతంగా శ్రీకాంత్ కు 50 వేల ఆర్ధిక సహాయం అందించారు ఎమ్మెల్యే అదీప్ రాజ్. ఇక ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్ విధించింది.
నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక వీరిని విచారించేందుకు పోలీసులు కస్టడీ కోసం పిటిషన్ వేసే అవకాశం ఉంది. అయితే జ్యుడీషియల్ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు నూతన్ నాయుడు భార్య మధుప్రియ అనారోగ్యం అంటూ నాటకం ఆడింది. అయితే కేజీహెచ్ వైద్య పరీక్షల్లో ఆమె ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు నిర్ధారించడంతో ఆమెను కూడా జైలుకు తరలించారు.