డ్రగ్స్ తీసుకునే హీరోతో డేటింగ్ చేశాను : కంగనా

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి డ్రగ్స్ గురించి ఆమె మాట్లాడారు. ఒక జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొందరు హీరోలు డ్రగ్స్ తీసుకుంటారని, తనకు కూడా డ్రగ్స్ ఇచ్చే ప్రయత్నం చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంగనా తనకు తెలిసిన ఒక పెద్ద హీరో డ్రగ్స్ తీసుకునేవాడని… ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం ఆ హీరో ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు.

ఆరోగ్యం క్షీణించడంతో ఆ హీరో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని… చివరికి ఆ హీరో చెడు అలవాట్ల వల్ల అతని భార్య దూరమైందని చెప్పారు. అలా డ్రగ్స్ వల్ల ఆ హీరో కుటుంబంలో అనుకోని సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. కొన్ని కారణాల వల్ల డ్రగ్స్ కు బానిసైన ఆ హీరోతో డేటింగ్ చేశానని కంగనా చెప్పుకొచ్చారు. అయితే ఆ హీరోతో డేటింగ్ చేయడం వల్ల తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు.

అయితే ఇన్ని విషయాలు చెప్పిన కంగనా ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 99 శాతం మంది తనకు తెలిసినంత వరకూ డ్రగ్స్ వాడతారని ఆమె చెప్పారు. ఒక వ్యక్తి తనకు గురువు అని అందరికీ చెప్పుకుంటాడని ఆ వ్యక్తే తనకు డ్రగ్స్ అలవాటు చేశాడని అన్నారు. సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ లోని చీకటి కోణాల గురించి వెల్లడిస్తున్న కంగనా ఈ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. డ్రగ్స్ అమ్మేవాళ్లను విచారిస్తే డ్రగ్స్ వాడే స్టార్ హీరోల జాబితా వెలుగులోకి వస్తుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news