Grama Revenue Conferences on Land Issues: ఏపీ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచీ రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నారు. ఇక ఈ రెవెన్యూ సదస్సులు 33 రోజులపాటు నిర్వహిస్తారు. ప్రతీ గ్రామంలో ఎంఆర్ఓ స్ధాయి అధికారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు జరుగనున్నాయి.
ఈ రెవెన్యూ సదస్సులలో భూకబ్జాలు, ఆక్రమణలు, భూ వివాదాలు పరిష్కరించనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అక్కడికక్కడే ప్రతీ భూ సమస్య పరిష్కారం చేయనున్నారు.
సమస్యకు పరిష్కారం ఆలస్యం అయితే… సదస్సుల అనంతరం 45 రోజుల్లోగా తగిన పరిష్కారం దొరుకనుంది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్.