చిరంజీవి కూతురు శ్రీజకు పవన్‌ కళ్యాణ్‌ వల్ల ప్రాణ హాని – వైసీపీ ఎమ్మెల్యే

-

చిరంజీవి కూతురు శ్రీజకు పవన్‌ కళ్యాణ్‌ వల్ల ప్రాణ హాని ఉందని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పార్టీ ఎందుకు పెట్టారు అనేది అందరికీ తెలుసు అని.. చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేస్తున్న పవన్ కాపులను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆగ్రహించారు.

పవన్ పార్టీ గుర్తు, పార్టీని కాపాడుకొడంపై దృష్టి పెట్టాలని… భీమవరంలోని ఓటర్లు ఎంత మంది ఉంటారు, ఎన్నిక విధానం లాంటివి కూడా పవన్ కు తెలీదని విమర్శలు చేశారు. సినిమా వాళ్ళకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది.. యాంకర్ అనసూయ వచ్చినా రాజమండ్రీ లో జనం కిక్కిరిసి పోయారని… గోదావరి జిల్లాలో రౌడీఇజం అనేది పెద్ద జోక్ అంటూ రెచ్చిపోయారు.

చిరంజీవి కూతురు శ్రీజ తన బాబాయ్ వల్ల ప్రాణ హాని ఉందని చెప్పిన విషయం, ఆ సమయంలో గన్ పట్టుకుని పవన్ రౌడిగా వ్యవహరించిన తీరు ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. పీక నొక్కేయడం, గుడ్డలు ఊడదీసి కొట్టడం, మక్కెలు ఇరగ తీయడం పవన్ కళ్యాణ్ మ్యానిఫ్యాస్టో అని.. చంద్రబాబు కళ్ళతో పవన్ కళ్యాణ్ చూస్తున్నారు కాబట్టి వైసీపీ చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version