ఏపీలో గ్రూపు 2 ఫలితాలు విడుదల

-

ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ  విడుదల చేసింది. 905 గ్రూప్-2 ఉద్యోగాల నియామకానికి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాలో 2,517 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.

వీరందరికీ ధ్రువపత్రాలను తనిఖీ చేసే తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. హైకోర్టు తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ కీని ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news