ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇటీవల కూటమి ప్రభుత్వం 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 37 చోట్ల టీడీపీకి చెందిన వారికి, 8 చోట్ల జనసేన నేతలకు, 2 చోట్ల బీజేపీ నేతలకు పదవులు దక్కినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 38 మార్కెట్ కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేనకు, ఒకటి బీజేపీ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే మిగిలిన కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజా నియామకాలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 85 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తయింది.