Isro : నేడు జీఎస్ఎల్వీ-14 ప్రయోగం ఉండనుంది. ఈ రోజు సాయంత్రం 5:35 గంటలకు శ్రీహరి కోటలోని ప్రయోగ కేంద్రం నుంచి జిఎస్ఎల్వీ 14 రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది. దీనిద్వారా ఇన్ శాట్-3డీఎస్ శాటిలైట్ ను రోదసిలోకి పంపించనున్నారు.
నిన్న మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఇన్ శాట్-3డీ సిరీస్ లో ఇప్పటివరకు 23 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఇన్ షాట్-3డీకి కొనసాగింపుగా 3డీఎస్ పనిచేస్తుంది. ఈ ప్రయోగం దృష్ట్యా షార్ లో భద్రత పెంచారు.