Cm Jagan: రేపు రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ

-

Cm Jagan: రేపు రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ జరుగనుంది. రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం రాప్తాడు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి జగన్ తాడేపల్లి చేరుకుంటారు. ఇప్పటికే జరిగిన రెండు సిద్ధం సభలు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి.

YCP Siddham poster out

కాగా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీన తుది విచారణ జరుగనుంది. ఈ మేరకు వైసీపీ రెబెల్స్ ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లిలకు స్పీకర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నాం జరిగే తుది విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version