టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి పొత్తుల గురించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చాలా మంది పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనుకున్నారు జనసైనికులు.. కాపు సోదరులు. చంద్రబాబును జైలులో కలిసి పొత్తు అని ప్రకటించారు పవన్ కళ్యాణ్. పవన్ సీఎం అవుతారని కాపులు భావించారు. 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు పట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు 40 సీట్లు ఇచ్చారని మీరు నమ్మండి కాపు సోదరులారా..?
పవన్ కళ్యాణ్ కి తిక్క ఉండటం వల్లనే కనీసం ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కూడా ప్రకటించలేదు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తారని మాత్రం ప్రకటించారు. పవన్ కి లెక్క ఉందా..? ఇదా తిక్క లెక్క. నిజమైన చిత్తశుద్ధి ఎలా ఉంటారో తెలుసుకో.. జగన్ మోహన్ రెడ్డి లా ఉంటారు. ఎవ్వరితో పొత్తు లేకుండానే ఎన్నికల్లోకి వచ్చారు. మొదటి ఓడిపోయినా.. రెండోసారి సంకల్పంతో ప్రజల ముందుకొచ్చి అధికారంలోకి వచ్చారు. పార్టీ పెట్టి సీఎం అవుతానని భ్రమలు కల్పించి.. అభిమానులను వెన్నుపోటు పొడిచావని పేర్కొన్నారు.