నాకు తిక్కుంది.. దానికి ఓ లెక్క ఉంది.. ఇది తిక్క లెక్క : అంబటి రాంబాబు

-

టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి పొత్తుల గురించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చాలా మంది పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనుకున్నారు జనసైనికులు.. కాపు సోదరులు. చంద్రబాబును జైలులో కలిసి పొత్తు అని ప్రకటించారు పవన్ కళ్యాణ్. పవన్ సీఎం అవుతారని కాపులు భావించారు. 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు పట్టుకొచ్చారు.

ఓ సినిమాలో డైలాగ్ పవన్ కి కరెక్ట్ సూట్ అవుతోంది. “నాకు తిక్కుంది.. దానికి ఓ లెక్క ఉంది”. ఇది తిక్క లెక్క..  పవన్ కళ్యాణ్ కి నిజంగానే తిక్కుందన్నారు అంబటి.  24 సీట్లతోనే అది తిక్క అని అర్థం అవుతోందన్నారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రాజీనామా చేసి పార్టీని విలీనం చేసుకుంటే బెటర్.. పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే.. సినిమాలు తీసుకో.. మీ అన్న చిరంజీవిని ఆదర్శంగా తీసుకో.. నీకు అభిమానులు పెరుగుతారు. రాజకీయాల వల్ల అభిమానులు కూడా నిన్ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు మంత్రి అంబటి. 

Read more RELATED
Recommended to you

Latest news