నారావారిపల్లి నుంచి జూబ్లీహిల్స్ వరకు అంతా చంద్రబాబు అవినీతే – మంత్రి అమర్నాథ్‌

-

నారావారిపల్లి నుంచి జూబ్లీహిల్స్ వరకు అంతా చంద్రబాబు అవినీతే అంటూ చురకలు అంటించారు మంత్రి అమర్నాథ్‌. ఇవాళ మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఒక బ్యాక్ డోర్ పొలిటీషియన్ అంటూ చురకలు అంటించారు.

నారావారిపల్లి నుంచి జూబ్లీహిల్స్ భవంతి వరకు అవినీతి పునాదులు మీద నిర్మించిందని ఆరోపణించారు. 118కోట్లు లంచం తీసుకున్నారని ఇన్ కం టాక్స్ చెబుతుంటే చంద్ర బాబు ఎందుకు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్నా హజారే అనుచరుడు…గాంధీజీ తమ్ముణ్ణి అని చెప్పుకునే చంద్రబాబు తనపై లంచగొండి ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ఇన్ కంటాక్స్ తీగ లాగితే చంద్రబాబు డొంక కదలడం ఖాయమని హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఆస్తులు, ప్రజాధనం ఎలా దోపిడీకి గురైందో మొత్తం లెక్కలు బయటకు రానున్నాయి….ఐటీ శాఖ 46పేజీలు షోకాజ్ నోటీసు ఇస్తే తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించాడని చురకలు అంటించారు. నోటీసులు వచ్చిన ప్రతీసారీ పొంతన లేని లేఖలు రాసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎలా…? అని ప్రశ్నించారు. అమరావతిలో దొంగతనం చేసి….జ్యురిడిక్షన్ కాదని ఐటీ శాఖతో వితండ వాదన చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version