పోలవరానికి ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుపై నామకరణం చేయాలని బిజెపి ఎంపీ GVL నరసింహారావు కోరారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తున్నందున తాను చేసిన విజ్ఞప్తిపై కేంద్ర జల్ శక్తి మంత్రి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు పోలవరం నిర్మాణం కోసం రూ. 15,146 కోట్లు ఇచ్చినట్లు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తెలిపారు.
ఇక అంతకు ముందు వైసీపీపై విమర్శలు చేశారు జీవీఎల్. సీఎం వైఎస్ జగన్ విశాఖ వచ్చి కూర్చుంటానంటే ఎవరు అభ్యంతరం చెప్పరు అని బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖలో రాజధానిగా డిక్లేర్ చేసే అవకాశం, అధికారం ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని అంశమం కోర్టు పరిధిలో ఉందన్నారు. అభివృద్ధి అవకాశాలు ఉన్నా వెనుకబడిన ప్రాంతమం శ్రీకాకుళం అన్నారు. వేల సంఖ్య లో మత్స్యకారులు వలసలు ఉన్నాయని తెలిపారు.