బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా..!

-

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇవాళ వాదనలు కొనసాగాయి. విచారణ మొత్తం 17 ఏ చుట్టూ తిరిగింది. చంద్రబాబు తరపున విదానలు వినిపించారు హరీశ్ సాల్వే. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాదనలు కొనసాగాయి. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. 

రాజకీయ వేధింపుల్లో భాగంగా చంద్రబాబు అరెస్ట్ చేశారని.. హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. 2018 పీసీ చట్ట సవరణకు ముందే స్కిల్ కేసులో నేరం జరిగిందని సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. 2021లోనే ఎఫ్ఐఆర్ నమోదు అయిందని.. 2023లో ఆధారాలు బయటపడటంతో చంద్రబాబును నిందితుడిగా చేర్చినట్టు తెలిపారు. ఇందులో రాజకీయ కక్ష సాధింపు లేదని.. పిటిషనర్ అరెస్టు అయిన కొద్ది రోజుల్లోనే కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. అతనిపై విచారణ ప్రారంభం కాకముందే కేసు కొట్టేయాలనే ఆలోచనతో ఈ పిటిషన్ వేశారని రోహత్గీ వాదనలు వినిపించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 

Read more RELATED
Recommended to you

Latest news