భారీ వరదలు : వాహనాల ఇన్సూరెన్స్‌ చెల్లింపుపై బీమా సంస్థల కొత్త తిరకాసు!

-

ఏపీలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ పట్టణ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే, బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ ముంపు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో ప్రజలకు సంబంధించి వాహనాలు మొత్తం నీట మునిగాయి. దీంతో అవి ప్రస్తుతం రిపేర్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.అన్ని రోజులు నీటిలో మునగడంతో వాహనాలు పనిచేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బీమా సంస్థలతో మాట్లాడి వారికి క్లెయిమ్స్ వచ్చేలా చేసింది.

అయితే, తాజాగా క్లెయిమ్ చెల్లించాల్సిన బీమా కంపెనీలు కొత్త తిరకాసు పెట్టినట్లు తెలుస్తోంది. నీట మునిగిన వాహనాలకు బీమా చెల్లించాలంటే ముంపునకు గురయ్యే నాటికి ఆ వాహనాలకు చెందిన బీమా యాక్టివ్‌లో ఉండాలని షరతు విధించాయి. బీమా చెలామణిలో ఉంటేనే పరిహారం అందుతుందని పేర్కొన్నాయి.ముంపునకు గురయ్యే ఒక్క రోజు ముందు గడువు ముగిసినా, సకాలంలో రెన్యూవల్ చేసుకోకపోయినా, థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ తీసుకున్నా క్లెయిమ్ వర్తించదని పేర్కొన్నాయి. కాంప్రహెన్సివ్/ప్యాకేజీ పాలసీ తీసుకుని ఉండాలని బీమా సంస్థలు స్పష్టంచేస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news