తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాడానికి నిత్యం లక్షలాది మంది భక్తులు కొండకు వెళ్తుంటారు. దీంతో తిరుపతి ఎల్లప్పుడూ భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. అందుకే స్వామి వారి దర్శనానికి చాలా సమయం పడుతుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం నేడు (మంగళవారం) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నట్లు సమాచారం.ఇక టైమ్ స్లాట్ దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తుండగా.. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.కాగా నిన్న(సోమవారం) తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని 67,030 మంది భక్తులు దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.ఇక 23,476 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు సమకూరినట్లు టీటీడీ పేర్కొంది.