ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పశ్చిమ, మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన వాయుగుండం గత కొన్ని గంటలలో 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్యదిశగా కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది.వాయుగుండం దాదాపు ఉత్తరం వైపుగా ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదిలి, రాగల 24 గంటలలో తీవ్ర వాయుగుండం గా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దింతో శ్రీకాకుళం, పార్వతిపురం,అల్లూరి విజయనగరం విశాఖ, అనకాపల్లి కాకినాడ పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలకు ఇవాళ హాలిడే ఇచ్చారు కలెక్టర్. ఈ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు హాలిడే ఇచ్చినట్లు కలెక్టర్లు తెలిపారు. తమ ఆదేశాలు కాదని ఎవరైనా స్కూలు లేదా కాలేజీలు తెలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.