ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఏపీలో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు మూడు రోజులపాటు ఉన్నట్లు తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలలో గత వారం రోజుల నుంచి వాతావరణం చల్లబడిన సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా బలపడనుందని ఐఎండి వెల్లడించింది. ఇది రెండు రోజుల్లో తుఫాన్ గా మారనుందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ మన్యం, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ వర్షాలు తెలంగాణకు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.