అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్.. టీటీడీకి కీలక ఆదేశాలు

-

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమ కట్టడాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తాజాగా తిరుమల కొండపై పలు ప్రాంతాల్లో కడుతున్న అక్రమ కట్టడాలపై హైకోర్టు లో పిటిషన్లు నమోదవ్వగా.. విచారణ జరిపింది. పవిత్ర పుణ్యక్షేత్రం, అటవీ ప్రాంతం అయిన తిరుమలలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్  అయింది. తిరుమలను కాంక్రీట్ జంగిల్ గా మార్చొద్దని కోర్టు వ్యాఖ్యానించింది. తిరుమల తిరుపతిని.. కాంక్రీట్ జంగిల్ గా మారనీయకుండా.. వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తిరుమలలో చేస్తున్న పలు భవన నిర్మాణాల్లో అప్రమత్తంగా ఉండాలని కోర్టు సూచించింది.

దీంతో పాటుగా కొండపై ఇప్పటికే నిర్మాణంలో ఉన్న.. పలు ధార్మిక సంస్థల పేరుతో.. అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని వ్యాఖ్యానించింది. ఇటువంటి అక్రమ నిర్మాణాలకు  అనుమతిస్తూ పోతే.. అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని ఏపీ హైకోర్టు  ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే.. తిరుమలలో ఇటీవల అడవిలో ఉండాల్సిన పులులు, ఇతర వణ్యప్రాణులు నేరుగా ప్రజాక్షేత్రం లో తిరుగుతున్న వీడియోలు అనేకం వైరల్ గా మారుతున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news