సీఐడీ నమోదు చేసిన లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగనుంది. సీఐడీ నమోదు చేసిన లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు రాజశేఖర్ రెడ్డి. ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కసిరెడ్డి.

లిక్కర్ స్కామ్ కేసులో నాలుగు సార్లు నోటిసులు ఇచ్చినా సిట్ ఎదుట విచారణకు హాజరుకాని కసిరెడ్డి… సీఐడీ నమోదు చేసిన లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఇలా ఉండగా ఏపీ లిక్కర్ కుంభకోణం లో వైసిపి పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి కూడా ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అతనికి నోటీసులు నోటీసులు ఇచ్చిన అధికారులు… మొన్న ఎనిమిది గంటల పాటు విచారణ కూడా చేశారు. ఈ సందర్భంగా చాలా విషయాలను మిథున్ రెడ్డి నుంచి గ్రహించారు అధికారులు. మళ్లీ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పారు.