మరో వివాదంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చిక్కుకున్నారు. అల్ట్రాటెక్కు సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తున్న వాహనాలు అడ్డుకున్నారు ఆదినారాయణ రెడ్డి అనుచరులు. ఈ తరుణంలోనే మాజీ మంత్రి ఆదినారాయణ అనుచరులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అటు ప్లేయాష్, సున్నపురాయి సరఫరా ఐదు రోజులుగా నిలిచిపోయింది.

ఇప్పటికే ఒక ప్లాంట్ లో ఆగిపోయింది ఉత్పత్తి. కూటమి ప్రభుత్వంలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆదినారాయణరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినట్లు వెల్లదించారు.