తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 3కి.మీ మేర బారులు తీరిన భక్తులు

-

తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. మరో పదిహేను రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సెలవుల్లోనే భక్తులు తమ పిల్లలతో తిరుమలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సన్నిధిలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు, నిండిపోయాయి.

తిరుమలలో రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు బారులు దీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.  క్యూలైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, తితిదే భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version