ఏపీలో భారీగా వాలంటీర్ ఉద్యోగాలు.. అప్లికేష‌న్‌కు ఈ రోజే లాస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వాలంటీర్ ఉద్యోగాల‌కు ఉన్న ప్రాముఖ్య‌త ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇదో వ‌రం అనే చెప్పాలి. ఎందుకంటే గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగం అంటే ఎంత క‌ష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో వరుసగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు.

ప్ర‌స్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ ప్రకటన విడుదల చేశారు ఏపీ అధికారులు. మొత్తం 309 ఖాళీలు ఉన్న‌యాని, ఇంటర్, టెన్త్ పాసై స్థానిక గ్రామ లేదా వార్డు పరిధిలో నివసిస్తున్న అభ్యర్థులు దీనికి అర్హులు,

ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్థానికంగానే ఇంటర్వ్యూలు నిర్వహించి వారిలో అర్హుల‌ను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ పథకాలు, చేపట్టిన కార్యక్రమాలపై ఎక్కువ‌గా ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఉంటాయి. గతంలో సేవా కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన సంస్థల్లో పని చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ నెల 3 వ తేదీ గురువారంలోగా అభ్య‌ర్థులు అప్లై చేసుకోవాలి. పూర్తి వివ‌రాల కోసం https://gswsvolunteer.apcfss.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాలి.