నేడు వైఎఎస్సార్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా అమలు

-

పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించే విధంగా అన్ని విధాలుగా సహాయపడుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. పేద పిల్లల వివాహానికి గౌరవప్రదంగా జరిపించేలా వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి అందిస్తున్న ఈ సాయాన్ని మంగళవారం మరోసారి అమలు చేయనున్నారు.

గత ఏడాది అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న అర్హులైన 10, 132 జంటలకు వైయస్సార్ కళ్యాణమస్తు వైయస్సార్ షాది తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైయస్ జగన్ ఇవాళ తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైయస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా ద్వారా సీఎం జగన్ ఆర్థిక సాయం అందిస్తున్నారు.

వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్లు వరుడికి 21 ఏళ్లుగా నిర్దేశించారు ఈ పథకానికి పదో తరగతి ఉత్తీర్త తప్పనిసరి చేశారు. దీంతో చిన్నారులు పదో తరగతికి వచ్చేసరికి వారికి 15 ఏళ్ల వయస్సు వస్తుంది సీఎం జగన్ ఒకటవ తరగతి నుంచి ఏటా అందిస్తున్న 15000 జగనన్న అమ్మఒడి సాయం ఇంటర్ వరకు ఇస్తున్న ఈ సాయంతో 17 ఏళ్ల వయసు వచ్చేసరికి వారి ఇంటర్ చదువు కూడా పూర్తి అవుతుంది. అక్షరాస్యతను పెంచాలని ఉద్దేశంతో సీఎం జగన్ ఈ సాయం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news