పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు ప్రభుత్వం కీలక ప్రకటన

-

Chandrababu Govt on distribution of pensions:  పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని.. అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Important announcement of Chandrababu Govt on distribution of pensions

జులై 1న ఉదయం ఆరు గంటల నుంచి ఇళ్ల దగ్గరకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని.. వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది. ఇక అటు ఏపీలో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుపత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. గత ప్రభుత్వంలో రీ-సర్వే పూర్తైన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కుపత్రాలను ఇప్పటివరకు పంపిణీ చేశారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. తదుపరి చర్యల్లో భాగంగా సచివాలయంలో భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్‌ సిద్దార్థ జైన్‌తో బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news