Madakasira: మడకశిర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలక్కప్ప నామినేషన్ దాఖలు చేశారు. మడకశిర నియోజకవర్గంలో వైసీపీ తరపున ఉపాధి హామీ కూలీ ఈరలక్కప్ప నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ తీశారు.

అయితే….మడకశిర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలక్కప్ప అఫిడవిట్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అఫిడవిట్ లో 99,883 రూపాయల ఆస్తులు చూపించారు మడకశిర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలక్కప్ప. సొంత ఇల్లం, పొలం లేవని ఈరలక్కప్ప అఫిడవిట్ లో వెల్లడించారు. ఈరలక్కప్పకు 1,13,050 రూపాయల అప్పులు ఉన్నాయట. అలాగే.. మద్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు తనపై కేసు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు వైసీపీ అభ్యర్ధి ఈరలక్కప్ప.