గోదావరి జలాలు తరలించుకొని వెళ్తే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటి? : వినోద్ కుమార్

-

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మరోసారి కాంగ్రెస్, బీజేపీపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో ప్రెస్ మీట్ నిర్వహించిన వినోద్.. కేంద్రం నదుల అనుసంధానం చేస్తోందని, దాని వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అన్నారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంటో తేల్చాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సమ్మక్క సారక్క, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండని కేంద్రాన్ని కోరారు. ఆ తర్వాతే నదుల అనుసంధానం గురించి ఆలోచించాలని చెప్పారు.

“రాష్ట్ర ప్రభుత్వం ఏం అడుగుతుందో ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపి రాష్ట్ర నేతలు, ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పాలి. 1985లో ఇచ్చంపల్లి పై ఎన్టీఆర్ సీఎం హయాంలో సర్వే చేశారు. మహారాష్ట్ర ఛత్తీస్గడ్ ప్రాంత ప్రజలు, ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ఇచ్చంపల్లికి అనుమతి ఇవ్వకుండా.. గోదావరి నీటిలో మనవాటా ఎంతో తేల్చకుండా ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో దురుద్దేశంతో నదుల అనుసంధానంపై దృష్టి పెట్టింది. తెలంగాణకు వచ్చే నీళ్లను కొల్లగొట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. గోదావరి నది జలాలు తరలించుకుపోతే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటీ?” అని వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news