పట్టపగలే ఇండియన్ బ్యాంకు ఏటీఎం ధ్వంసం..!

-

చంద్రగిరి పట్టణంలో తిరుపతి చంద్రగిరి రహదారిలో ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎం ను ఓ గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో పగులగొట్టేందుకు ప్రయత్నించిన ఘటన ఆదివారం చోటు చోటు చేసుకుంది. స్థానికులు కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణ:లోని ఇండియన్ బ్యాంకు సమీపంలో ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎం మిషన్ ను ఓ గుర్తు తెలియని వ్యక్తి బండరాయి తీసుకొచ్చి ఏటీఎం మిషన్ ను పగులగొట్టేందుకు ప్రయత్నించాడు.

అదే సమయంలో స్థానికులు అక్కడికి రావడంతో సైకిల్ పై వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఇండియన్ బ్యాంకు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఇండియన్ బ్యాంకు అధికారులు ఏటీఎం వద్దకు చేరుకొని పరిశీలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇండియన్ బ్యాంకు అదికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news