కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు !

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అయితే.. ఈ తరుణంలోనే కేక్ కట్ చేసి పోలీసులు సెలబ్రేట్ చేసుకోవడం వివాదంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నదని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది పోలీసులు.. అత్యుత్సాహంతో ఇలా చేశారు. ఇక తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు పోలీసులు.

Police at Congress MLA Vivek’s birthday celebrations

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ఇది మరింత శ్రుతి మించుతున్నది. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు చేయగా వారితో కలిసి చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్, మందమర్రి పోలీసులు సైతం పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

Read more RELATED
Recommended to you

Latest news