హైదరాబాద్ లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను విజయవంతం చేసే విషయమై చర్చించేందుకు ఇన్ చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరిగిన ఈ సమావేశంలో చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయ లక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. 7, 8, 9 తేదీలలో డివిజన్, నియోజకవర్గాలు, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేసారు. రైసింగ్ హైదరాబాద్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేయనుండటంతో ప్రజల్లో వారిపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు మంత్రి పొన్నం.