IPL 2023 : ఐపిఎల్ బెట్టింగ్.. కారణంగా చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. అయినప్పటికీ.. ఐపిఎల్ బెట్టింగ్.. చేయడం ఎవరూ మానడం లేదు. అయితే.. తాజాగా అన్నమయ్య జిల్లా.. శివాలయంలో ఉరివేసుకుని సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు ఐపిఎల్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులే కారణంగా చెబుతున్నారు స్దానికులు.
బి.కొత్తకోట (మం)ఆకుల వారిపల్లి సమీపంలోని శివాలయం లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు దెయ్యాల వారిపల్లికి చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి (24) గా గుర్తించారు పోలీసులు. హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు శ్రావణ్. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చాడు యువకుడు. ఈ తరుణంలోనే.. ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.