ఏలూరులో వింత వ్యాధికి కల్తీ పాలే కారణమా..?

-

ఆంధప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి వ్యాపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే పరిశోధకులు ఈ వింత వ్యాధికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదట్లో మున్సిపాలిటీ తాగునీరు కారణమని కొంతమంది పేర్కొనగా.. మరికొందరు పారిశుద్ధ్య లోపమని వెల్లడిస్తున్నారు. తాజాగా మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Eluru
Eluru

కల్తీపాల వల్ల ఈ వింత రోగం వచ్చి ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. వైద్యులు రోగుల నుంచి తీసుకున్న బ్లడ్ శ్యాంపిల్స్ లో సీసం, నికెల్ లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని తెలిందంట. సీసం వల్లే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలుపుతున్నారు. ఇది తాగునీటి ద్వారా.. లేదా పాల ద్వారా రోగుల శరీరంలోకి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు పరిశోధకులు ఏలూరులో తాగునీరు, పాల నమూనాలను సేకరించి ఢిల్లీలోని ఎయిమ్స్ కు పంపించనున్నారు. అక్కడి నిపుణులు పరీక్షించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే ఇక్కడి తాగునీటితోపాటు పాలల్లోనూ తేడాలున్నాయని వైద్యులు అనుమానిస్తున్నారు.

ఏలూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో కల్తీ పాల విక్రయం అనధికారికంగా కొనసాగుతోంది. ఇంటింటికీ పాలు విక్రయించకపోయినా.. హోటళ్లు, స్వీట్ షాపులు, స్థానిక డెయిరీల్లో కల్తీపాల వినియోగం ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రచారాలు వినిపిస్తున్నాయి. పాల విక్రయంతోపాటు పాలపొడితో తయారు చేసిన పాలను ఎక్కువగా వాడుతున్నారని సమాచారం. అదే విధంగా మున్సిపాలిటీ నీటిలో కల్తీ క్లోరినేషన్ జరిగినా ఇలాంటి సమస్యలు తలెత్తే ప్రమాదముందని డాక్టర్లు చెబుతున్నారు.

కొందరు అక్రమార్కులు డబ్బులు సంపాదించుకోవడానికి ఇష్టానుసారంగా పాలను కల్తీ చేస్తున్నారు. వీరు చేసే తప్పిదాల కారణంగా ప్రజల ప్రాణాల మీదుకు వస్తోంది. పాలను కల్తీ చేయడానికి డిటర్జెంట్ నీళ్లు, సింథటిక్ స్టార్చ్ కలిపి అనేక పద్ధతుల్లో పాలను కల్తీ చెయోచ్చు. 100 లీటర్ల నీటిలో 5 కిలోల యూరియాను కలిపితే అది పాలలా తెల్లగా మారిపోతుంది. అందులో 250 గ్రాముల డిటర్జెంట్, కొంచెం రిఫైన్డ్ ఆయిల్ కలుపుతారు. పాలలా వాసన వచ్చేందుకు కెమికల్ తో తయారు చేసిన తెల్ల పౌడర్ వేస్తారు. 40 లీటర్ల ఈ ద్రవాన్ని 60 లీటర్ల పాలతో కలిపి 100 లీటర్ల కల్తీ పాలు సిద్ధం చేసుకుంటారు. ఇలా తయారు చేసిన పాలను స్వీట్ షాపుల్లో అమ్ముతుంటారు. కల్తీపాలను, అసలు పాలను గుర్తించడం సామాన్యులకు తెలియదు కాబట్టి ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news